MCN NEWS : కిర్లంపూడి కాకినాడ జిల్లా : రాష్ట్ర రాజకీయ చరిత్రలోనే ఏ రాజకీయ నాయకుడు అందుకోని జన నీరాజనాలు తమ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి అందుకోగలుగుతున్నారని జగ్గంపేట శాసనసభ్యుడు జ్యోతుల చంటిబాబు పేర్కొన్నారు. మండల కేంద్రం కిర్లంపూడి లో వైయస్సార్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఏర్పాటు చేసిన వై.ఎస్ జగన్మోహన్ రెడ్డి 50వ, జన్మదిన వేడుకల్లో ఎమ్మెల్యే చంటిబాబు ముఖ్య అతిథిగా విచ్చేసి గ్రామస్తులను పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. ఈ కార్యక్రమాన్ని మండల అభివృద్ధి కార్యాలయం ఆవరణలో ఎంపీపీ తోట రవి అధ్యక్షతన నిర్వహించారు. ముందుగా గ్రామానికి విచ్చేసిన గౌరవ శాసనసభ్యునకు యంగ్ మేన్ స్పోర్ట్స్ క్లబ్ అధ్యక్షుడు పెంటకోట నాగబాబు, నాయకత్వంలో వైయస్సార్ పార్టీ కార్యకర్తలు, పార్టీ శ్రేణులు ఎదురెళ్లి ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం తమ అభిమాన నాయకుడైన ముఖ్యమంత్రి Y.S జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి కార్యకర్తల కోరిక మేరకు గౌరవ ఎమ్మెల్యే చేతుల మీదుగా పాలాభిషేకం చేయించి వారీ అభిమానాన్ని చాటుకున్నారు. అక్కడ నుండి స్థానిక ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి చేరుకొని అక్కడ ఉన్న రోగులకు, వృద్ధులకు పండ్లు రొట్లను వైయస్సార్ పార్టీ నాయకులు అందించారు. ఈ సందర్భంగా జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు మాట్లాడుతూ రాష్ట్ర రాజకీయ చరిత్రలోనే జగన్మోహన్ రెడ్డి ఒక బ్రాండ్ అంబాసిడర్ గా నిలదొక్కుకున్నారని అన్నారు. అంతటి చరిష్మా ఉన్న నాయకుడు కావడం వల్లే ఆయన జన్మదిన వేడుకలను జరుపుకొనేందుకు కోట్లాదిమంది అభిమానులు పోటీ పడుతున్నారని ఆయన గుర్తు చేశారు. అటువంటి సమర్థవంతమైన నాయకుడు మన రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా కొనసాగడం ప్రజలందరూ చేసుకున్న అదృష్టంగా భావించాలని ఎమ్మెల్యే ప్రజలకు వివరించారు. దేశంలోనే ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా మన రాష్ట్రంలో సంక్షేమాలు అమలవుతున్న తీరు రాజకీయ విమర్శకులను సైతం ఆశ్చర్యపరిస్తుందని చంటిబాబు గుర్తు చేశారు. ముఖ్యమంత్రి తన మూడున్నర ఏళ్ల పాలనలో ప్రజలకు ఇచ్చిన హామీలే కాకుండా ఇవ్వని హామీలను సైతం నెరవేర్చి చరిత్ర తిరగరాసిన ముఖ్యమంత్రిగా ప్రజల గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోయారని ఎమ్మెల్యే చంటిబాబు కొనియాడారు. మడమ తిప్పని మాట తప్పని వంశంలో జన్మించిన స్వర్గీయ వైయస్ రాజశేఖర్ రెడ్డికీ జగన్మోహన్ రెడ్డి కుమారుడు కావడం వల్ల 2024లో జరగనున్న ఎన్నికల్లో మరోసారి మీ అందరి చల్లని ఆశీస్సులు అందించి ముఖ్యమంత్రిగా చూడాలని ఎమ్మెల్యే చంటిబాబు వైసిపి కుటుంబ సభ్యులను మరియు జగ్గంపేట నియోజకవర్గ ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో A.M.C చైర్మన్ జనపరెడ్డి బాబు, వైస్ ఎంపీపీ బొడ్డేటి గణపతి, రాష్ట్ర బీసీ కార్పొరేషన్ల డైరెక్టర్లు మొల్లేటి సరస్వతివీరబాబు, సంగనసూర్యకుమారి వెంకటేశ్వరరావు, బిళ్లకుర్తి నాగమణి, శివాజీ, ఇళ్ల అప్పారావుకాపు, పార్టీ అధ్యక్షుడు దోమాల గంగాధర్, సొసైటీ అధ్యక్షులు చదలవాడ బాబి, A.M.C డైరెక్టర్ తోట విష్ణుమూర్తి, మండల ఎంపీటీసీల సమైక్య అధ్యక్షుడు అల్లు శివరామకృష్ణ, మాజీ ఎంపీపీ గణేశుల లచ్చబాబు, నియోజకవర్గ సోషల్ మీడియా కన్వీనర్ శెట్టి సోమరాజు, అలాగే నాయకులు యల్లపు నానాజీ, రాపేటి ప్రసాద్, శరకణం సంతోష్, ఆడారి మహేష్, కంచి లక్ష్మణ దొర, దాడి పెద్ద బుజ్జి, దిడ్డి గణపతి, నైధాన రఘు, పీలా లోవసుబ్రహ్మణ్యం, ఆళ్ల బాబులు, ఇసరపు సూరిబాబు, ఆడారి గంగబాబు, మూరా శ్రీనివాస్, శరకణం సత్తిబాబు, అదేవిధంగా గ్రామ సర్పంచులు తోట అయ్యన్న, సూతి శ్రీను, పట్టు చంటిబాబు, మందేటి పెద్దిరాజు, మొల్లేటి గంగారావు, గొరకపూడి అనంతలక్ష్మి గోపీనాథ్, అంబటి బుజ్జమ్మ, ఓలేటి రాజేశ్వరరావు, రాసబోయిన శ్యామ్, ఎంపీటీసీలు బండారు ప్రసాద్, రాపేటి గంగాభవాని, గోరకపూడి మమత నాగేశ్వరరావు, జ్యోతుల పెదబాబు, తదితర కార్యకర్తలు వైయస్సార్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.
చరిత్రలోనే ఏ రాజకీయ నాయకుడు అందుకోని జన నీరాజనాలు
ADD
RELATED ARTICLES