MCN NEWS : జనవరి 11:తూర్పుగోదావరి జిల్లాఅనపర్తి
శ్రీ శారద సంగీత కళా సమితి అనపర్తి ఆధ్వర్యంలో 24వ త్యాగరాజ ఆరాధన ఉత్సవ సాంస్కృతిక సమ్మేళన కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. 8వ రోజు మంగళవారం శ్రీ నృత్య కళానిలయం నాట్యాచారిని జి శైలశ్రి (విజయవాడ )శిష్య బృందం చే శాస్త్రీయ కూచిపూడి నృత్య ప్రదర్శనలు నిర్వహించారు. ఈ కార్యక్రమాలు ప్రముఖ పారిశ్రామికవేత్త శ్రీ సబ్బిళ్ళ అమ్మిరెడ్డి . ఆర్థిక సౌజన్యంతో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి అతిధిగా నల్లమిల్లి వీర్రెడ్డి హాజరయ్యారు .ఈ నృత్య కార్యక్రమం లైవ్ ఆర్కెస్ట్రా సహాయంతో జరిగింది. శ్రీ కుమార సూర్యనారాయణ శ్రీమతి సుధా శ్రీనివాస్ గాత్ర సహకారం అందించారు. వాయులీనపై శ్రీ గణపతి . మృదంగం పై శ్రీ ఫణి .వేణువుతో శ్రీ కుమార్. కీబోర్డ్ తో శ్రీ అశోక్ కుమార్. నట్టువాంగం కుమారి సత్య నందిని సహకరించారు. ఈ నృత్య ప్రదర్శనలో త్యాగరాజ స్వామి వారి కొన్ని ముఖ్యమైన కృతులను నృత్య రూపంలో ప్రదర్శించడంతోపాటు, “నౌకా చరితము “అనే యక్షగాన శైలి నృత్య నాటకం(త్యాగరాజు స్వామి రచన) అద్భుతంగా ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో 20 మంది నృత్యకారులు తమ అత్యుత్తమ ప్రదర్శన ద్వారా విశేష సంఖ్యలో హాజరైన ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశారు .కార్యక్రమానంతరం శ్రీ అమ్మి రెడ్డి చేతుల మీదగా నాట్యాచారిని శ్రీమతి జి శైలశ్రీ ఘనంగా సత్కరించారు. వాయిద్య సహకారం కళాకారులతోపాటు గాత్రకారులను కూడా సత్కరించారు . కళా సమితి ప్రతినిధి కొవ్వూరి రఘునాథరెడ్డి సభ వ్యాఖ్యలు వివరించారు చిన్న ఆదిరెడ్డి , నల్లమిల్లి మురళి . మారెళ్ళ గంగరాజు శర్మ. సక్కు. కొవ్వూరి వెంకటరెడ్డి. మునీశ్వర్ రెడ్డి. తదితరులు పర్యవేక్షణలో జరిగింది . .. 24వ త్యాగరాజ ఆరాధన ఉత్సవాలు ఆధ్యాత్మిక సాంస్కృతిక . కార్యక్రమాలు వైభవంగా నిర్వహించారు,
ఘనంగా ముగిసిన త్యాగరాజ ఆరాధన ఉత్సవాలు
ADD
RELATED ARTICLES