MCN NEWS : అనపర్తి: తూర్పుగోదావరి జిల్లా అనపర్తిలోఏరియా మేనేజర్ ఎమ్.జానకిరామయ్య ఆదేశాల మేరకు ఎం సి సి ఇంచార్జ్ రవికుమార్ ఆధ్వర్యంలో సంగం డైరీ అభివృద్ధి ప్రదాత స్వర్గీయ శ్రీ ధూళిపాళ్ల వీరయ్య చౌదరి వర్ధంతి సభ తూర్పు గోదావరి జిల్లా అనపర్తి ఎం సి సి నందు నిర్వహించారు కార్యక్రమంలో ఇంచార్జి CH.రవికుమార్ తో పాటు సూపర్ వైజర్లు K.శివప్రకాష్,A.వెంకట్రావు, పాలు ఏజెంట్లు, రైతులు, మరియు సిబ్బంది పాల్గొన్నారు.ఈ సందర్భంగా రామసీతాడైరీపామ్ అధినేత కర్రి పుత్రారెడ్డి మరియు పాలు సేకరణ ఏజెంట్లు లో ఒకరైన శ్రీ దేవిమిల్క్ డైయిరీ అధినేత పోతంశెట్టి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ఇంతవరకు ఎన్నిడైరీలు వచ్చినప్పటికి పాడి రైతులకు మేలు జరిగింది లేదని సంఘం వల్ల రైతులకు ఎంతో మేలు జరుగుతుందన్నారు ఇంతకుముందు పాడి అభివృద్ధి కొరకు రైతులు నుండి సేకరించిన పాలు డైరీ కి కొంతవరకు మాత్రమే పంపి కొన్ని పాలు సేల్స్ కి ఉపయోగించి దాని ద్వారా వచ్చి లాభం రైతులు అభివృద్ధి కొరకు ఉపయోగించే వారుము. అటువంటి అవకాశం అందరికీ లేఖ కొన్ని గ్రామాల్లో రైతులకు మేలు జరగక పాడి తగ్గిపోయింది. అటువంటిటైము లో సంఘం డైరీ రావడంతో ఎంతో ఆనందం కలిగిందన్నారు.డైరీవల్ల పాడి రైతులకు ఎంతో మేలు చేకూరుతుందని ఆనందం వ్యక్తం చేశారు. అటువంటి సంస్థ అభివృద్ధి ప్రదాత స్వర్గీయ శ్రీ ధూళిపాళ్ల వీరయ్య చౌదరిని గుర్తుకు తెచ్చుకోవడం ఎంతో ముఖ్యం అన్నారు.
ఘనంగా ధూళిపాళ్ల వర్ధంతి సభ
ADD
RELATED ARTICLES