ఆంధ్రన్యూస్
కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజవర్గం మండలం కేంద్రంలోని స్థానిక శ్రీ రేణుక ఎల్లమ్మ దేవాలయం ప్రాంగణం నందు డ్రైవర్లు దినోత్సవం జరుపుకొనుటకు మండలంలో ఉన్న అసోసియేషన్ సభ్యులు అందరూ కలుసుకొని కోసిగి మండల సేఫ్టీ డ్రైవర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేశారు.
ఈ సందర్భంగా డ్రైవర్ అసోసియేషన్ సభ్యులు మాట్లాడుతూ 9రాష్ట్రాలలో ఈ డ్రైవర్ దినోత్సవం సెప్టెంబర్ రెండో తేదీన జరుపుకుంటున్నామని వెంటనే ప్రభుత్వం గుర్తించి డ్రైవర్ల దినోత్సవం గా ప్రకటించాలని ఈ సందర్భంగా కోసిగి లోని స్థానిక శ్రీ రేణుక ఎల్లమ్మ ఆవరణలో ఈరోజు కేక్ ను కట్ చేసి ఘనంగా జరుపుకుంటున్నామని వారు తెలిపారు.
అదేవిధంగా డ్రైవర్లకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి 50 సంవత్సరాలు దాటిన ప్రతి డ్రైవర్‌కు పింఛన్ మరియు డ్రైవర్ల కుటుంబానికి ఆరోగ్య సమస్యలు ఏవైనా వస్తే ప్రభుత్వం ఉచిత వైద్యం ఆ కుటుంబనికి కల్పించాలని మరియు ఆర్టీవో వేధింపులు,పోలీసుల వేధింపులు ఆపాలని వారు అన్నారు.
ఈ కార్యక్రమంలో కోసిగి మండలం ఫోర్ వీలర్ సేఫ్టీ డ్రైవర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ శ్రీనివాసులు,వైస్ ప్రెసిడెంట్ కృష్ణ ,సెక్రటరీ గోరవ ఈరన్న,లక్ష్మన్న, ఆర్లబండ ఎర్రిస్వామి గౌడ్, రమేష్ గౌడ్ యూనియన్ డ్రైవర్లు పాల్గొన్నారు.
ఆంధ్రన్యూస్ రాయలసీమ జోన్ రిపోర్టర్ బి అబ్రహం 9640441653