Thursday, February 9, 2023
spot_imgspot_imgspot_imgspot_img
Homeతూర్పుగోదావరి జిల్లాఘనంగా గో వృషభ కల్యాణం

ఘనంగా గో వృషభ కల్యాణం

MCN NEWS : బిక్కవోలు, తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం బిక్కవోలు మండలం బలభద్రపురం గ్రామం లో శ్రీదేవి భూదేవి సమేత ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయం లో ఈ రోజు గో వృషభ కల్యాణం ఆలయ కమిటీ వారి సమక్షంలో ఘనంగా నిర్వహించారు.విశేషంగా భక్తులు పాల్గొన్న ఈ కార్యక్రమంలో పురోహితులు ఆవుకు వృషభం కు కల్యాణం జరిపించారు.గ్రామ శ్రేయస్సు కోరుతూ జరిగిన ఈ కల్యాణం లో ఆలయ ట్రస్ట్ చైర్మన్ శ్రీ మల్లిడి గంగా రెడ్డి కుమారుడు శ్రీనివాసరెడ్డి లక్ష్మి ప్రభావతి ,అల్లుడు కొవ్వూరి రామా కాంత రెడ్డి మంగ దంపతుల చే ఈ కల్యాణ కార్యక్రమంనిర్వహించారు. ఈ కల్యాణ నిర్వహణ వల్ల సంతాన వృద్ధి, అభివృద్ధి జరుగుతుంది అని ,గ్రామం సుభిక్షంగా ఉండి పాడి పంటల తో తులతూగుతూ సర్వతో ముకాభివృద్ధి చెందుతుందని ఆలయ ప్రధాన అర్చకులు శ్రీ వేణు గోపాలచారి తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న భక్తులు ఈ కల్యాణం తిలకించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో అన్న ప్రసాద వితరణ జరిపించారు.భక్తుల కు అన్ని సదుపాయాలు ఆలయ కమిటీ పర్యవేక్షణ లో సమకూర్చారు.

ADD

spot_imgspot_imgspot_imgspot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_imgspot_imgspot_imgspot_img

Most Popular

spot_imgspot_imgspot_imgspot_img

Recent Comments