MCN NEWS: ఏలేశ్వరం. విద్యార్థులు నిరుద్యోగులు గ్రంథాలయాలను సద్వినియోగం చేసుకొని వృద్ధిలోకి రావాలని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ దూలం పద్మ వెంకన్నబాబు పిలుపునిచ్చారు. ఏలేశ్వరం కాలేజీ రోడ్లో 22 లక్షల రూపాయలతో నిర్మించిన గ్రంథాలయ భవనాన్ని ఆమె మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ పుస్తకం చదవడం ద్వారా విద్యానాన్ని పెంపొందించుకోవాలన్నారు. ప్రతి ఒక్కరికి ఉపయోగపడే పుస్తకాలను, పేపర్లను గ్రంథాలయాల్లో ఉంచడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ప్రత్తిపాడు ఎమ్మెల్యే పర్వత పూర్ణచంద్ర ప్రసాద్, ఏలేశ్వరం చైర్ పర్సన్ అలమండ సత్యవతి, వైస్ చైర్ పర్సన్ శిడగం త్రివేణి, కౌన్సిలర్లు అలమండ చలమయ్య, బదిరెడ్డి గోవిందబాబు, మూదీ నారాయణస్వామి, సుంకర రాంబాబు, గ్రంథాలయ పాలకుడు కవికొండలు సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
గ్రంథాలయాలు సద్వినియోగం చేసుకోవాలి
ADD
RELATED ARTICLES