MCN NEWS : జంగారెడ్డిగూడెం. జంగారెడ్డిగూడెం రోటరీ క్లబ్ జనవరి 21 నుండి యువత పెడద్రోవ పట్టకుండా క్రికెట్ బెట్టింగ్ ల బారిన పడి తమ జీవితాలను నాశనం చేసుకోకుండా ‘మైదానంలో ఆడుదాం,జూదం కోసం కాదు”అనే సందేశంతో స్థానిక శ్రీచత్రపతి శివాజీ త్రిశత జయంతి డిగ్రీ కళాశాల ప్రాంగణంలో నిర్వహిస్తున్న “రోటరీ సూపర్ ఎయిట్” క్రికెట్ పోటీల్లో మేముసైతం అంటూ జంగారెడ్డిగూడెం లోని ప్రధాన రాజకీయపార్టీలు పాల్గొనేందుకు ముందుకువచ్చి క్రీడాస్ఫూర్తిని చాటాయి.
రోటరీ జంగారెడ్డిగూడెం అధ్యక్షులు దాకారపు కృష్ణ మాట్లాడుతూ జనవరి 22,ఆదివారం ప్రధాన రాజకీయపార్టీల మధ్య క్రికెట్ పోటీలు ప్రత్యేకంగా జరుగుతాయని యువత జీవితంలో ఎదగాలని ఆశిస్తూ క్రికెట్ ను ఆడటం ద్వారా రాజకీయపార్టీలు ఆదర్శం అవిష్కరించేందుకు ముందుకు రావడం జంగారెడ్డిగూడెం క్రీడా చరిత్రలోనే ఒక ప్రత్యేకతను సంతరించుకునే అంశంగా నిలవనుందని అన్నారు.
మంగళవారం ఉదయం రోటరీ కార్యదర్శి వూడా రాంగోపాల్(గోపీ) నిర్వహణలో దాకారపు కృష్ణ సారధ్యంలో రోటరీ ప్రతినిధులు తెలుగుదేశం రావూరి కృష్ణ,కాంగ్రెస్ జెట్టి గురునాధరావు,పీ పీ ఎన్ ఫౌండేషన్ పీ పీ ఎన్ చంద్రరావు,జనసేన మేకా ఈశ్వరయ్య,ఆకుల రాకేష్ మరియు బీ జే పీ పర్వతం రాధాకృష్ణతో కూడిన టీంల నుండి వెయ్యి రూపాయల ప్రవేశరుసుము అందుకున్న సందర్భంగా దాకారపు కృష్ణ మాట్లాడుతూ ప్రతీ పార్టీకి వారి సిద్ధాంతాలు,లక్ష్యాలు ఉంటాయని అన్నారు అయితే జంగారెడ్డిగూడెం అభివృద్ధి చెందాలని ఆశిస్తూ అన్ని పార్టీలు తమ కార్యాచరణతో సాగుతున్న క్రమంలో యువతను జాగృతి చేసే క్రమంలో వారిని ఎక్కువగా ఆకర్షించే క్రికెట్ క్రీడ బెట్టింగ్ విషవలయం లో పడకూడదన్న సందేశానికి సంపూర్ణంగా అందరూ మద్దతు నివ్వడం చరిత్ర అవుతుందని ప్రతీ పార్టీకి,నాయకులకు వారి టీం లకు రోటరీ నుండి కృతజ్ఞతలు తెలిపారు.
క్రీడ ఆరోగ్యాన్ని,ఉల్లాసాన్ని,ఒత్తిడి లేని జీవితాన్ని అందిస్తుందని ముక్యంగా ఆరోగ్యకరమైన పోటీతో క్రీడాస్ఫూర్తికి ప్రేరణై నిలుస్తుందని ఈ క్రమంలో రోటరీ మంచి సందేశంతో ముందుకు రావడంతో తమ మద్దతును క్రీడలో పాల్గొనడం ద్వారా అందించామని రాజకీయపార్టీల ప్రతినిధులు తెలుపుతూ రోటరీని అభినందించారు.
కార్యక్రమంలో రోటరీ ప్రతినిధులు మారిశెట్టి ప్రవీణ్,రొంగల దేవీప్రసాద్, బవిరిశెట్టి తిలక్,కొమ్ముకూరి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.