(కోసిగి ఆంధ్రన్యూస్)
దివంగత నేత,జలప్రధాత,జన హృదయ నేత డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి 13వవర్ధంతి వేడుకలు వైకాపా నాయకులు,కార్యకర్తలు మరియు అభిమానుల మధ్యన కోసిగిలో ఘనంగా జరిగాయి.శుక్రవారం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కర్నూలు జిల్లా అధ్యక్షులు వై.బాలనాగిరెడ్డి ఆదేశాల మేరకు మండల ఇంచార్జీ మురళీమోహన్ రెడ్డి,మండల కన్వీనర్ బెటన్న గౌడ్ వైయస్సార్ వర్థంతి వేడుకలకు ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. కోసిగి వైయస్సార్ సర్కిల్ నందు మహానేత మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పాలాభిషేకం చేసిన అనంతరం రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి జమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈసందర్బంగా ఆయన మాట్లాడుతూ,కాంగ్రెస్ పార్టీ గుడ్డు పరిస్థితుల్లో ఉన్నప్పుడు పార్టీ కోసం పాదయాత్ర చేసి సియం పగ్గాలు చేపట్టిన కేవలం 5సంవత్సరాల్లోనే అనేక సంక్షేమ పథకాలను అమలు చేసి జనాల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్న మహానేత అని,మళ్ళీ అధికారం చేపట్టిన ముడు నెలల్లోనే రచ్చబండకు వెళ్తూ ఉంటే కొందరి దిష్టితగిలి అలాంటి మహానీయున్ని ప్రకృతి ఒడిలోకి చేర్చుకుంది. డాక్టర్ వైయస్సార్ మన మధ్యన లేకపోవడం,ఆయన ఆశయ సాధనకు వైయస్ జగన్మోహన్ రెడ్డి కంకణం కట్టుకొని మన మధ్యకు వచ్చి తిరుగులేని మెజారిటీ సాదించి పాలన సాగిస్తున్నాడని గుర్తు చేశారు.అనంతరం వైయస్సార్ సర్కిల్ నందు శ్రీ గజనాన వినాయక మిత్ర మండలి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయకుడిని దర్శించుకున్నారు. ఈకార్యక్రమంలో మండల, ఆయా గ్రామాల నాయకులు, కార్యకర్తలు,వైయస్సార్ అభిమానులు పాల్గొన్నారు.
కోసిగిలో ఘనంగా డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి వర్ధంతి..
ADD
RELATED ARTICLES