Thursday, February 9, 2023
spot_imgspot_imgspot_imgspot_img
Homeతూర్పుగోదావరి జిల్లాకొమరిపాలెంలో కళ్ళజోళ్ళు, మందులు పంపిణీ

కొమరిపాలెంలో కళ్ళజోళ్ళు, మందులు పంపిణీ

MCN NEWS : తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు మండలం కొమరిపాలెం గ్రామంలో గ్రామ సర్పంచ్ వాసంశెట్టి రవికుమార్ ఉప సర్పంచ్ కొవ్వూరి సత్యనారాయణరెడ్డి సత్తిబాబు ఆధ్వర్యంలో వైయస్సార్ కంటి వెలుగు నిర్వహించారు. ఈ కార్యక్రమం ద్వారా అవ్వ తాతలకు వైద్య పరీక్షలు నిర్వహించి కళ్ళజోళ్ళు, మందులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ రవికుమార్ మాట్లాడుతూ అవ్వ తాతల కళ్ళల్లో వెలుగు చూడడమే జగన్ లక్ష్యమని కంటి చూపు మసక బారిన వారికి వైద్య పరీక్షలు నిర్వహించి కళ్ళజోళ్ళు అవసరమైన బాధితులకు కళ్ళజోళ్ళు ఉచితంగా ఇవ్వడం జరుగుతుందని ఆయన అన్నారు. గ్రామ ఉపసర్పంచ్ కొవ్వూరి సత్యనారాయణ రెడ్డి సత్తిబాబు మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఏ వర్గం వారిని ఏ వయసు వారిని వదలకుండా ప్రతి ఒక్కరికి ఏదో విధంగా సంక్షేమం అందించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారని ప్రతి ఒక్కరూ దీనిని గమనించి ఆయన వెంట నడవాలని ఆయన సూచించారు. ఆంధ్ర రాష్ట్రాన్ని అనేకమంది ప్రముఖులు పాలించానా ఎంతటి సంక్షేమాన్ని ఎవరు ప్రవేశపెట్టలేదని అభివృద్ధి ఒకపక్క సంక్షేమం ఒకపక్క చేస్తూ ముందుకు సాగుతున్నారని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో గ్రామ కార్యదర్శి సతీష్ శ్రీనివాస్ రెడ్డి ఆరోగ్యశాఖ అధికారులు సచివాలయం సిబ్బంది వాలంటీర్లు లబ్ధిదారులు పాల్గొన్నారు

ADD

spot_imgspot_imgspot_imgspot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_imgspot_imgspot_imgspot_img

Most Popular

spot_imgspot_imgspot_imgspot_img

Recent Comments