MCN NEWS : యానాం. కేంద్ర పాలిత ప్రాంతం యానాం నియోజకవర్గానికి సంబంధించి నియోజకవర్గ శివారు గ్రామం దరియాలతిప్పలో రక్షిత మంచినీటి చెరువుల్లో పూడిక తొలగించకపోవడంతో త్రాగునీరు కలుషితంగా మారుతుందని గ్రామ పెద్దలు కమిడి బాలయోగి,సబ్బతి శ్రీనివాసరావు,గిడ్ల వెంకన్న,దాసరి బుజ్జి తదితరులు పీడబ్ల్యూడీ అధికారులకు ఫిర్యాదు చేశారు.ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా ఎవరు పట్టించుకోవడం లేదని,మా దరియాలతిప్ప ప్రజలకు కలుషిత నీరే దిక్కా అని ప్రశ్నిస్తున్నారు.కొన్నేళ్లుగా ఈ చెరువుల్లో గుర్రపు డెక్క, పిచ్చిమొక్కలు,నాచు పెరిగిపోయి దీనివల్ల కొద్ది రోజులుగా సరఫరా చేస్తున్న నీరు పసర కంపు కొడుతూ కలుషితంగా ఉంటుందని అవే తాగాల్సి వస్తుందని వారు ఆవేదన వ్యక్తపరిచారు.అవి తాగడం వల్ల గ్రామస్థులు అనారోగ్యానికి గురవుతున్నారని అందువల్ల చెరువులను ఆధునీకరించి,రివెట్మెంట్ ఏర్పాటు చేయాలని కోరారు.దరియాలతిప్పతో పాటు గిరియాంపేట, సావిత్రినగర్, దొమ్మేటిపేట,పరంపేట తదితర తీర గ్రామాలకు దరియాలతిప్ప మంచినీటి పథకం నుంచే నీటి సరఫరా జరుగుతుందన్నారు.దీనిపై అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.