MCN NEWS : బిక్కవోలు. తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం బిక్కవోలు మండలం కొంకుదురు ఉన్నత పాఠశాలలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.
దేశ స్వాతంత్య్రం కోసం తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా పోరాడిన వాళ్లలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఒకరని కొంకుదురు ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు కొవ్వూరి అమ్మిరెడ్డి అన్నారు. 127వ జయంతి సందర్భంగా పాఠశాల ఆవరణలో బోస్ చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన అనంతరం ఆయన విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు.
క్రీ.శ. 1897వ సంవత్సరంలో ఒరిస్సాలో జానకీనాథ్ బోస్ మరియు ప్రభావతి దత్ దంపతులకు 9వ సంతానంగా బోస్ జన్మించారని ఆయన తెలిపారు.
చదువులో ఎప్పుడూ ముందుండే బోస్ తండ్రి కొరిక మేరకు సివిల్ సర్వీసెస్ లో ఉద్యోగంలో చేరాడు. అయితే బ్రిటిష్ ప్రభుత్వానికి ఊడిగం చేయడం ఇష్టం లేక ఆ ఉద్యోగాన్ని కొద్ది కాలానికే వదిలేసాడు. అనంతరం స్వరాజ్ అనే పత్రికకు ఎడిటర్ గా చేరి స్వాతంత్య్ర సముపార్జనలో పత్రికను ఒక కీలక ఆయుధంగా మార్చాడు. గాంధీజీ అహింసావాదం ద్వారా మాత్రమే స్వాతంత్ర్యం సిద్ధిస్తుందని నమ్మగా బోస్ మాత్రం సాయుధ పోరాటమే ఏకైక మార్గమని ప్రజలకు బోధించాడు. వారి దారులు వేరైనప్పటికీ వారి లక్ష్యం మాత్రం ఒక్కటే నని, కార్యసాధనకై ఆనాటి నాయకుల కృషి, పట్టుదల లను నేటి విద్యార్థి లోకం ఆదర్శంగా తీసుకోవాలని అమ్మిరెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో వెంకటరామారెడ్డి. కృష్ణసాయి, ఈశ్వరరెడ్డి, వలీషా , వాణీసులోచన, అప్పారావు, చౌదరి,రాజశేఖర్, శిరీష మరియు విద్యార్థులు పాల్గొన్నారు