MCN NEWS శంఖవరం : జాతీయ బాలకా దినోత్సవం పురస్కరించుకొని కాకినాడలో కలెక్టరేట్ లో జరిగిన కార్యక్రమంలో శంఖవరం కేజీబీవీ విద్యార్థులు పలు అంశాలలో పాల్గొని విజయం సాధించగా వారికి జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా బహుమతులు ప్రధానం చేసి అభినందించారు. జాతీయ బాలికల దినోత్సవం సందర్భంగా కె.జి.బి.వి.శంఖవరం విద్యార్థులు డిబేటింగ్,పాట,బాల్యం వివాహం పై స్కిట్ మొదలైన అంశాలపై పాల్గొనగా వీరిని కలెక్టర్ కృతిక శుక్లా మరియు ,జి సి డి ఓ క్షేమాబాయి అభినందించారు. లేఖ(డిబేటింగ్ ), దుర్గ,,శ్రావణి,(పాట),ప్రశాంతి,కావ్య,సౌజన్య, వరలక్ష్మి దేవి (స్కిట్) విద్యార్థులు పాల్గొని విజయం సాధించి కలెక్టర్ చేతుల మీదుగా బహుమతులు పొందారు. ఈ కార్యక్రమంలో కేజీబీవీ ఉపాధ్యయురాలు తదితరులు పాల్గొన్నారు.
కేజీబీవీ విద్యార్థులను అభినందించిన కలెక్టర్ కృతికా శుక్లా
ADD
RELATED ARTICLES