MCN NEWS మెట్టజ్యోతి: తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు మండలం బలబద్రపురం గ్రామంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేతుల మీదగా ప్రారంభించిన గ్రాస్యమ్ ఇండస్ట్రీ అన్నీ పరిశీలించిన తర్వాతే అనుమతులు ఇచ్చామంటూ ప్రసంగించిన ఆ ఇండస్ట్రీ ప్రజల పాలిట శాపంగా మారింది అని అక్కడే ప్రజలు మరియు ఆ రోడ్డుని ప్రయాణించే ప్రయాణికులు పలువురు ఆరోపణలు చేస్తున్నారు వివరాల్లోకెళ్తే గ్రాసిం ఇండస్ట్రీకి ముడి సరుకు ఉప్పు ఈ ఉప్పును లారీలపై కాకినాడ నుంచి కెనాల్ రోడ్డు మీదగా బలబద్రపురం చేరుకోవాలి అయితే బలబద్రపురం వంతెనపై రోడ్డు సరిగ్గా లేకపోవడంతో అక్కడ లారీల నుండి వచ్చే ఉప్పు కిందకు కారిపోయి పలు ఇబ్బందులకు గురిచేస్తుంది కిందపడిన ఉప్పు పొడిగా ఉండటం వల్ల ఏదైనా భారీ వాహనం వెళ్ళేటప్పుడు దుమ్ముల పైకి లేస్తుంది ఆ పైకి లేచిన ధూళి వెనక వస్తున్న మోటార్ వాహన దారుల కళ్ళల్లోనూ మరియు కింద స్కూలు కు వెళ్లే పిల్లల కళ్ళల్లో పడి పలు ఇబ్బందులకు గురికావడం మే కాక పలు ప్రమాదాలు కూడా గురవుతున్నారు.గ్రామ నాయకులకు ఎవరికీ చెప్పిన పట్టించుకునే స్థితి లేకపోవడంతో అక్కడి గ్రామ ప్రజలు గగ్గోలు పెడుతున్నారు ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి ఈ ఉప్పు లారీలపై తగు చర్యలు తీసుకోవాలని లేని పక్షంలో ఉప్పు లారీలు తిరగకుండా ప్రజలే కఠిన చర్యలు తీసుకునే ఆలోచనలో ఉన్నారంటూ పలువురు ఆరోపణలు చేస్తున్నారు ఈ ఇండస్ట్రీ వెనక పెద్ద పెద్ద వాళ్ళు ఉండడంతో ఫిర్యాదు చేయడానికి సామాన్యుడు ముందుకు రాలేకపోతున్నారనీ పలువురు గుసగుసలాడుకోవడం విశేషం.