MCN NEWS : భద్రాద్రి కొత్తగూడెం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా కోట్ల రూపాయలు వెచ్చించి ప్రతి మండలాలలో పల్లె ప్రకృతి వనాలు… వైకుంఠధామాలు… ప్రజల కొరకు నిర్మిస్తోంది. ప్రజలు సేద తీరే చక్కటి పార్కులను ఏర్పాటు చేస్తుంటే పార్కు పక్కనే ఇసుక ర్యాంపు. నిర్వాహకులు. అనుకోని ప్రమాదాలకు తావిచ్చే విధంగా.. ప్రధాన రహదారి పక్కనే ఇసుక ర్యాంపు డంపింగ్ చేయడం ఎంతవరకు సమంజసం అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.
బూర్గంపాడు మండలం సారపాక నాగినేని ప్రోలు ప్రాంతానికి చెందిన గుమ్మూరు ఇసుక ర్యాంపు… ప్రధాన రహదారి పక్కనే ఇసుక డంపింగ్ కొండలుగా పేర్చడం. దారిన పోయే వారికి ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది…ఈ ప్రాంతం మూలమలుపు ఉండడం వల్ల ఎక్కువగా ప్రమాదాలు.. మరణాలు సంభవించే ప్రమాదం ఉందని అక్కడి ప్రజలు భయపడుతున్నారు.
మైనింగ్ టిఎస్ఎండిసి అధికారులు.. పార్టీ నాయకులు చొరవ తీసుకొని ఇక్కడి నుంచి డంపింగ్ వేరేచోటికి మార్చే విధంగా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.. బూర్గంపాడు సారపక మండల జాతీయ రహదారులపై నిత్యం ప్రమాదాలు సంభవించి ఎందరో ప్రాణాలు కోల్పోయారని స్థానిక ప్రజలు చెప్తున్నారు. ఇదే రహదారిపై ప్రతిరోజు కేటీపీఎస్ కు చెందిన కర్ర ట్రాక్టర్లు అధికలోడుతో వెళ్తుంటాయని.. ఇదే క్రమంలో ఇసుక లారీలు కూడా ఈ దారి గూండా వెళ్ళడం వల్ల మధ్యలో ప్రజాల ప్రాణాలకు ముప్పువాటిలే ప్రమాదం ఉందని ప్రజలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భారీ వాహనాలు తిరిగే ప్రధాన రహదారిపై అసలు ఇసుక డంపింగ్ చేయడానికి పర్మిషన్ ఎవరు ఇచ్చారు అంటూ స్థానిక ప్రజలు ప్రశ్నిస్తున్నారు., పక్కనే పల్లె ప్రకృతి వనం… లక్షలు వెచ్చించి నిర్మించిన. కాస్త పచ్చగా కనిపించే పల్లె ప్రకృతి వనం.. ప్రస్తుతం దుమ్ము దూళితో పూర్తిగా అందవీకారంగా తయారైందని ప్రజలు తెలిపారు.ప్రమాదాలు జరగకుండా చూడాల్సిన బాధ్యత బూర్గంపాడు పోలీసుల పై కూడా ఉందని అంటున్నారు.. ముఖ్య కూడళ్లలో సీసీ కెమెరాలు జాతీయ రోడ్లపై పెట్టాలని… మోరం పెళ్లి బంజర
లక్ష్మి పురం. సారపాక. బూర్గంపాడు ఈ నాలుగు కేంద్రాలలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని అన్నారు… ఈ విధంగానైనా ప్రమాదాలకు పూర్తి కారణాలు చట్టానికి.. ప్రజలకు సీసీ కెమెరాలు.. వారధిగా నిలుస్తాయని ప్రజలు కోరుతున్నారు.
కర్ర లారీలు ట్రాక్టర్లు ఇసుక లారీలు భారీ ఎత్తున ఈ ప్రాంతంలో తిరుగు తాయని. కాబట్టి యాక్సిడెంట్ చేసిన వారు కూడా దొరకకుండా వెళ్ళిపోతున్న సంఘటనలు అనేకం ఉన్నాయి. అందుకోసం ఎలాంటి ప్రమాదాలు జరగకుండా బూర్గంపాడు పోలీస్ అధికారులు చర్యలు తీసుకోవాలని. ఐటిసి పిఎస్పీడీ మేనేజ్మెంట్తో మాట్లాడి సీసీ కెమెరాలు పెట్టించాలని.. సంబంధిత అధికారులు చర్యలు తీసుకోకపోతే స్థానిక ప్రజలు ప్రధాన రహదారిపై ఆందోళనలో చేపట్టే అవకాశం ఉందని తెలుస్తోంది….
పాత గుమ్మూరు ఇసుక రీచ్ లో అధికారుల అవినీతిమయం…
ఇసుక ర్యాంపు లో ఆన్లైన్ బుకింగ్ లారీలకు ఓవర్ లోడ్ కి ఒక రేటు, జీరో లారీలకు ఒక రేటు చోప్పునా వసూలు చేస్తున్నట్లు సమాచారం… సంబంధిత అధికారి మౌనం పాటించడం వెనుక కారణం ఏమిటి అని పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు?, రాత్రి వేళలో భారీ యంత్రాలతో గోదావరి నది మధ్యనుండి భారీ యంత్రాలతో ఇసుక బయటకు తరలించడంలో టిఎస్ఎండిసి.. మైనింగ్ అధికారులు భారీ ఎత్తున ముడుపులు తీసుకున్నారా? అందుకే రైజింగ్ కాంట్రాక్టర్ కు వత్తాసు పలుకుతూ ప్రజాధనాన్ని లూటీ చేయడంలో సహాయ సహకారాలు అందిస్తున్నారా అన్నది మీ మాంస.
సంబంధిత అధికారుల పై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.