MCN NEWS : ఏలేశ్వరం:పట్టణంలోని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలను బుధవారం ఘనంగా నిర్వహించారు. స్థానిక నగర పంచాయతీ కార్యాలయంలో మున్సిపల్ చైర్ పర్సన్ అలమండ సత్యవతి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. అంతేకాకుండా ప్రభుత్వ ఆసుపత్రిలో రక్తదాన శిబిరం నిర్వహించారు. అలాగే మండలంలోని అన్ని గ్రామాల్లో జగన్ పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఏలేశ్వరం మండల ప్రజా పరిషత్ అధ్యక్షుడు గొల్లపల్లి బుజ్జి అన్నవరం సత్యదేవుని ఆలయంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నగర పంచాయతీ కౌన్సిలర్లు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
ఏలేశ్వరంలో వైఎస్ జగన్ పుట్టినరోజు వేడుకలు
ADD
RELATED ARTICLES