MCN NEWS : ఏలేశ్వరం: యర్రవరం గ్రామంలో సచివాలయంలో స్థానిక సర్పంచ్ బీశెట్టి అప్పలరాజు, మండల జడ్పిటిసి నీరుకొండ రామకుమారి సత్యనారాయణ, సచివాలయ సిబ్బందితో కలిసి మంగళవారం మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టారు.ఈ సందర్భంగా జడ్పిటిసి నీరుకొండ సత్యనారాయణ,సర్పంచ్ అప్పలరాజు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి అధికారం చేపట్టిన తర్వాత సంక్షేమ పథకాలఅమలుతో పాటు అభివృద్ధి కార్యక్రమాలలో శక్తి వంచన లేకుండా పనిచేస్తున్నారని తమ అభిమాన నాయకుడు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని కోరుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా మూడు రోజుల పాటు వివిధ కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని,దానిలో భాగంగా ఈరోజు సచివాలయంలో సుమారు పది మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టడం జరిగిందని తెలిపారు, ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి రాజమ రాజు మరియు సచివాలయ సిబ్బంది,ఉప సర్పంచ్ అడపా ఈశ్వరరావు, రామిశెట్టి వెంకటరమణ,బర్రె బాబూరావు,బుద్ధ గణేష్ తదితర నాయకులు పాల్గొన్నారు.
ఎర్రవరంలో మొక్కలు నాటే
ADD
RELATED ARTICLES