MCN NEWS : జంగారెడ్డిగూడెం. కొయ్యలగూడెం మండలం, కొయ్యలగూడెంలోని బిసి కాలనీలో జరిగిన ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమంలో మాజీ మంత్రి కె యస్ జవహర్ , నియోజకవర్గం కన్వీనర్ బొరగం శ్రీనివాసులు , రాష్ట్ర కార్యదర్శి దాసరి శ్యామ్ చంద్రశేషు పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో కె ఎస్ జవహర్ దాసరి శేషు మాట్లాడుతూ రాష్ట్రంలో జగన్ రెడ్డి పాలనలో ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారని ఏ ఒక్కరూ కూడా సుఖంగా లేరని సంక్షేమ పథకాల పేరుతో రాష్ట్రాన్ని సంక్షోభంలోకి నెట్టేశారనీ , రాష్ట్రంలో అప్పులు తప్ప అభివృద్ది లేదన్నారు, ప్రజల పక్షాన పోరాడుతున్న ప్రతిపక్షంపై దాడులు చేయటం కేసులు పెట్టడం తప్ప జగన్ పాలనలో ప్రజలకు చేసిందేమీ లేదని వారు విమర్శించారు, అందుకే జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ప్రజల వద్దకే నేరుగా వెళ్లి వారు ఎదుర్కుంటున్న సమస్యలను తెలుసుకుని వాటిని నమోదు చేసుకుని ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకుని వచ్చి సమస్యల పరిష్కారం కోసం కృషి చేయటం జరుగుతుందని, ప్రజలందరూ కూడా తెలుగుదేశం పార్టీ చేస్తున్న పోరాటానికి మద్దతుగా+91- 92612 92612 నంబరుకు మిస్డ్ కాల్ ఇవ్వాలని కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో టౌన్ పార్టీ అధ్యక్షులు జ్యేష్ఠ రామకృష్ణ, టౌన్ పార్టీ సెక్రెటరీ పూలపల్లి వెంకట్రావు, యర్రంపేట గ్రామ పార్టీ అధ్యక్షులు కొండ్రేడ్డి పూర్ణ, తెలుగుయువత పార్లమెంట్ సెక్రెటరీ నల్లూరి గోపికృష్ణ, మండల వాణిజ్యవిభాగం ప్రధాన కార్యదర్శి గుడిమెట్ల శేషారావు, యూనిట్ ఇంచార్జి ఆవుదొడ్డి ప్రసాద్, బొబ్బర రాజు, మైనారిటీ సాధికారిక రాష్ట్ర కమిటీ సభ్యులు షేక్ సుభానీ, తెలుగుమహిళా మండల కార్యదర్శి పెండ్యాల రమాదేవి, బిసి సెల్ మండల అధ్యక్షులు గంగుల నాగు, తెలుగుయువత మండల అధ్యక్షులు శివంగి సుమంత్, ఆనంద్ తదితరులు పాల్గొన్నారు