ఆంధ్రన్యూస్ : పసుపు రంగు కరువై కార్యకర్తలు అభిమానులు నాయకులు వెదురు చూశారు కానీ ఆ మహాభాగ్యము ఈరోజుకు తీరింది అది ఎలా అంటే బాదుడే బాదుడు కార్యక్రమం ద్వారా పసుపు రంగులు చూసి చిన్న బొంపల్లి గ్రామ ప్రజలు ఆనందముతో బ్యాండు భజంత్రీలతో నాయకులను గ్రామంలో ఊరేగిస్తూ పసుపు జండాలు పట్టుకొని చిందులు వేస్తూ పువ్వులతో పువ్వుల వర్షంలా పువ్వులను జల్లి తమ నాయకులను ఆనందపరిచారు.కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజవర్గం కోసిగి మండల పరిధిలోని చిన్న బొంపల్లి గ్రామంలో బాదుడే బాదుడు కార్యక్రమాన్ని మాజీ సర్పంచి నరసింహులు ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన కార్యక్రమానికి మాజీ ముఖ్యమంత్రి కోట్ల సూర్య ప్రకాశ్ రెడ్డి మరియు పాలకుర్తి తిక్క రెడ్డి,పాలకుర్తి దివాకర్ రెడ్డిలు హాజరు కావడం జరిగింది. విచ్చేసిన నాయకులకు చిన్న బొంపల్లి తెదేపా నాయకులు ఘన స్వాగతం పలికారు. మంత్రాలయం టిడిపి ఇన్చార్జి పాలకుర్తి తిక్క రెడ్డి మాట్లాడుతూ పల్లెపాడు గ్రామం నుంచి ఐరనగల్లు గ్రామం వరకు ప్రధాన రోడ్లు వేసిన ఘనత మా నాయకుడు కోట్ల సూర్య ప్రకాశ్ రెడ్డి అని ఆయన తెలిపారు.అదే విధముగా కోట్ల సూర్య ప్రకాశ్ రెడ్డి మాట్లాడుతూ ఈ నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో అభివృద్ధి పనులు చేస్తానని ఆ రోజుల్లో ఇచ్చిన మాట ప్రకారం ప్రతి గ్రామంలో అభివృద్ధి చేసి చూపించాం కానీ ఇప్పటివరకు ఎలాంటి అభివృద్ధి చెందలేదని ఆయన తెలిపారు.ఈ కార్యక్రమంలో ఎమ్మిగనూరు కదిరి కోటి ఆదెన్న,కోసిగి మాజీ చైర్మన్ అయ్యన్న, పల్లిపాడు రామ్ రెడ్డి, జంపాపురం కృష్ణారెడ్డి, కోసిగి టిడిపి మండల అధ్యక్షుడు జ్ఞానేశ్, వివిధ గ్రామాల ప్రజలు,చిన్న బొంపల్లి గ్రామ ప్రజలు పెద్దలు యువకులు మహిళలు భారీ ఎత్తున పాల్గొన్నారు.
ఇచ్చిన మాట ప్రకారం ప్రతి గ్రామంలో అభివృద్ధి చేసి చూపించాం
ADD
RELATED ARTICLES