- MCN NEWS : డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేట నియోజకవర్గం మండల కేంద్రం రాయవరం లో మంగళవారం మండల ప్రజాపరిషత్ సమావేశపు హాల్లో అధికారులతో రామచంద్రపురం ఆర్డీవో సిందు సుబ్రహ్మాణ్యం తాసిల్దార్ ,హౌసింగ్ డిఈ ,హౌసింగ్ ఏఈ , పిఆర్ ఏ, సమీక్షా సమావేశం నిర్వహించారు. మొదటిగా మండలమునకు విచ్చేసిన ఆర్డీవో సిందు ని మండల ప్రజా పరిషత్ అధ్యక్షుడు నౌడ్ వెంకటరమణ పుష్పగుచ్చము ఇచ్చి స్వాగతం పలికారు
ఈ సమీక్షలో మండలంలో ఉన్న 19 లేఔట్లలో వున్న1651 ప్లాట్లకు గాను ఇప్పటివరకు జరిగిన నిర్మాణాలపై ఇంజనీరింగ్ అసిస్టెంట్ ల వారి సమీక్ష చేపట్టి ఉన్నారు ముఖ్యంగా చెల్లూరు మాచవరం మరియు పసలపూడి గ్రామాలవి మొత్తం 875 ప్లాట్లు ఒక్క చెళ్లురు లే ఆవుట్ నందే ఉన్నవి .తర్వాత స్థానంలో సోమేశ్వరం మాచవరం వెదురుపాక కూర్మాపురం వెంటూరు నదురు బాద లోల్ల గ్రామాల్లో ఉన్నాయి ఇప్పటివరకు 1651 ప్లాట్లకి గాను 310 బేస్మెంట్ లెలెల్ లోను ,51 రూఫ్లేవిల్లోను ,116 రూఫ్ కాస్టింగ్ దశలోనూ .261 కంప్లీట్ దశల్లో ఉన్నాయి ఇంకా 910 బిలో బేస్మెంట్ దశలో ఉన్నాయి ఈ బిలో బేస్మెంట్ లెవెల్ ఉన్న వాటిని అధికారులు దృష్టి సారించి వీటి నిర్మాణములను వేగవంతం చేయాలని ఆదేశించి ఉన్నారు. పేదలందరికీ ఇళ్లు పథకంలో నివేశన స్థలాలు మంజూ రైన లబ్ధిదారులు త్వరితగతిన ఇళ్ల నిర్మాణాలు పూర్తిచేసేలా చర్యలు తీసుకోవాలని ఆర్డీవో సిందు సుబ్రహ్మాణ్యం అన్నారు. ఈసందర్భంగా ఆర్డీవో మాట్లాడుతూ మండలంలోని 12 గ్రామాల్లో 19 సచివాలయాల పరిధిలో నిర్మాణాలు చేపట్టిన ప్రభుత్వ భవన నిర్మాణాలు వేగవంతం గా పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని, నివేశన స్థలాలు మంజూరైన లబ్ధిదారులకు గృహ నిర్మాణాలపై అవగాహన కల్పించి త్వరితగతిన నిర్మాణాలు చేపట్టేలా చర్యలు తీసుకోవాలన్నారు. 12 గ్రామాల్లో ఇళ్ల నిర్మాణాలు ప్రగతి ఏవిధంగా ఉంది, కాలనీల్లో క ల్పించాల్సిన మౌళిక వసతులపై ఆర్డీవో గృహనిర్మాణశాఖ అధికారులను ఆరాతీశారు. ఈకార్యక్రమంలో గృహనిర్మాణశాఖ డీఈఈ కొవ్వూరి సత్యనారాయణరెడ్డి, ఎంపీడీవో డి.శ్రీనివాస్, ఏఈ కేఎన్ఎన్రెడ్డి, ఎన్ఆర్ఈజీఎస్ ఏపీవో వెలుగు ఏపీఓ ఏఈ ఆర్డబ్ల్యూఎస్ అన్ని సచివాలయాల ఇంజనీరింగ్ అసిస్టెంట్లు పాల్గొన్నారు
స్టాఫ్ రిపోర్టర్ : ప్రసాద్
ఆర్డీవో సిందు సుబ్రహ్మాణ్యం అధికారులతో సమీక్షా సమావేశం
ADD
RELATED ARTICLES