గాబు కృష్ణ, గంగాధర్
MCN NEWS , శంఖవరం: ఆరోగ్య పరిరక్షణలో పారిశుధ్య కార్మికుల పాత్ర కీలకమైనదని వారు లేకపోతే అపరిశుభ్ర వాతావరణం ఏర్పడి అనారోగ్య సమస్యలు పెరుగుతాయని మండల కో ఆప్షన్ సభ్యులు గాబు కృష్ణ, సుబ్రహ్మణ్యేశ్వర ఆలయ కమిటీ చైర్మన్ గాబు గంగాధర్ తెలిపారు. మండలంలోని కత్తిపూడి గ్రామంలో గల గాబు గంగాధర్ కార్యాలయం వద్ద జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు పురస్కరించుకుని ప్రత్తిపాడు శాసనసభ్యులు పర్వత ప్రసాద్ ఆదేశాలు మేరకు గ్రామంలో పనిచేసే పారిశుధ్య కార్మికులకు మండల కో ఆప్షన్ సభ్యులు గాబు కృష్ణ, సుబ్రహ్మణ్యేశ్వర ఆలయ కమిటీ చైర్మన్ గాబు గంగాధర్ చేతుల మీదుగా దుస్తులు, స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజా ఆరోగ్యం కోసం నిరంతరం శ్రమించే పారిశుద్ధ్య కార్మికులకు మనమందరం రుణపడి ఉంటామని, మన పరిసరాల శుభ్రత కోసం ప్రతిరోజు విధి నిర్వహణే ధ్యేయంగా వీధిలోగల చెత్తను, డ్రైనేజీలను శుభ్రపరుస్తూ ఆరోగ్య పరిరక్షణ ధ్యేయంగా శ్రమిస్తూ ఉంటారని తెలిపారు. ప్రతి ఒక్కరు వీరి యొక్క శ్రమను గుర్తించి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ జీలకర్ర విష్ణు, వైకాపా నాయకులు గౌతు దొరబాబు, మాదేపల్లి మహేష్, జీలకర్ర లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.