ప్రధానోపాధ్యాయులు వై సూర్యనారాయణ
MCN NEWS : శంఖవరం : ప్రతి ఒక్కరిలో సహాయం చేసే గుణం ఉండాలని ఆపదలో ఉన్నవారిని ఆదుకునేందుకు ముందుకు రావాలని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు సూర్యనారాయణ తెలిపారు. మండల కేంద్రమైన శంఖవరం గ్రామంలో గల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు ఉపాధ్యాయులు, ఉపాధ్యాయేతర సిబ్బంది మరియు విద్యార్థులు సహాయంతో బోన్ క్యాన్సర్ తో బాధపడుతున్న తొమ్మిది సంవత్సరాల బాలుడికి శంఖవరం గ్రామంలో గల పూర్వ విద్యార్థుల ప్రోత్సాహంతో 14000 రూపాయలు సహాయం అందించారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు సూర్యనారాయణ మాట్లాడుతూ ఆపదలో ఉన్న వారికి సహాయం చేయడం మానవ ధర్మం అని చైతన్యంగా ఆలోచించి ముందుకు వచ్చిన ఉపాధ్యాయులకు విద్యార్థులకు అభినందనలు తెలిపారు. ఆపదలో ఉన్న వారిని ఆదుకునేందుకు మరెన్నో సేవా కార్యక్రమంలో మన పాఠశాల ద్వారా చేయాలని పిలుపునిచ్చారు.