-
సచివాలయ సేవలు విస్తృత పరచాలి.
-
సిబ్బందికి బయోమెట్రిక్ తప్పనిసరి.
-
ప్రభుత్వ భవనాలు త్వరితగతిన పూర్తి చెయ్యాలి.
-
డివిజన్ అభివృద్ధి అధికారి కె యస్ వి ప్రసాద్ రావు.
MCN NEWS : శంఖవరం: పేద ప్రజలకు పారదర్శకంగా ప్రభుత్వ పధకాలు చేరవెయ్యాలనే లక్ష్యం తో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సచివాలయ వ్యవస్థ ను తీసుకుని వచ్చారని సచివాలయాల ద్వారా అందించే సేవలను విస్తృత పరచే బాధ్యత సచివాలయ సిబ్బంది దేనని పెద్దాపురం డివిజన్ అభివృద్ధి అధికారి కె యన్ వి ప్రసాదరావు తెలిపారు. స్ధానిక మండల పరిషత్ కార్యాలయంలో శనివారం పెద్దాపురం డివిజన్ అభివృద్ధి అధికారి ప్రసాదరావు, మండల అభివృద్ధి అధికారి జె రాంబాబు అద్యక్షతన కార్యదర్శి లకు,డిజిటల్ అసిస్టెంట్ లకు,ఇంజినీరింగ్, వెల్ఫేర్ మరియు ఎడ్యుకేషన్ అసిస్టెంట్ లకు నిర్వహించిన సమావేశంలో ప్రసాదరావు మాట్లాడుతూ సచివాలయ సిబ్బంది అందరూ విధి నిర్వహణలో సమయపాలన పాటించాలని ,బయోమెట్రిక్ తప్పనిసరి అని ప్రతీ ఒకరు యూనిఫాం మరియు బ్యాడ్జిలను ధరించాలి అని తెలిపారు.సచివాలయ ద్వారా అందించే సేవలు విస్తృత పరచే దశలో బాగంగా తమ తమ వార్డు పరిధిలో గల వాలంటీర్లు చే ప్రభుత్వ పధకాలు ప్రజలకు చేరవేసేందుకు వాలంటీర్లకు తగిన శిక్షణా సమావేశాలు ఏర్పాటు చేసి తెలియజేయాలన్నారు.మండలం లో జరగవలసిన అభివృద్ధి కార్యక్రమాలు వేగవంతం చేసేందుకు ప్రయిత్నించాలని ,ప్రభుత్వ ప్రాధాన్య భవనాలు అనగా సచివాలయాలు,రైతు భరోసా కేంద్రాలు ,వెల్ నెస్ సెంటర్ లు త్వరితగతిన పూర్తి అయ్యేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. నవరత్నాల లో బాగంగా పేదలందరకీ ఇల్లు పధకం లో లబ్ధిదారులు త్వరితగతిన గృహములు నిర్మించే విధంగా చర్యలు చేపట్టాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల ప్రత్యేకాధికారి చంద్రరావు, హౌసింగ్ డిఇ వేణుగోపాల్ రావు ,ఎఇ ప్రసాద్ ,యన్ ఆర్ ఇ యస్ ఎపిఓ రాజగోపాల్ ,ఐకెపియమ్ ఎ పి యమ్ వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.