Thursday, February 9, 2023
spot_imgspot_imgspot_imgspot_img
Homeకాకినాడ జిల్లాఅడ్డా ఈసారి రాజమండ్రే నా?

అడ్డా ఈసారి రాజమండ్రే నా?

మెట్టజ్యోతి : జాతీయ రహదారిపై జరుగుతున్న గంజాయి అక్రమ రవాణాకీ అడ్డుకట్ట వేసేందుకు జిల్లా పోలీసు యంత్రాంగo ఎన్ని చర్యలు చేపట్టిన స్మగ్లర్లు కొత్త దారులు వెతుకుతూనే ఉన్నారు. మొన్నటి వరకు గంజాయి తోటలు సాగు చేయడానికి పుట్టినిల్లుగా ఉన్నా విశాఖ ఏజెన్సీ ప్రాంతం ఈసారి మాత్రం రాజమండ్రి అందుకు కేరాఫ్ గా మారిoదనడంలో ఎంత మాత్రం అతిశయోక్తి కాదు. ఎందుకంటే జాతీయ రహదారి మీదగా గంజాయి రవాణా జరిగి పోలీసులకు ఎప్పుడు పట్టుబడ్డ స్మగ్లర్లు తెలిపిన వివరాల ప్రకారం విశాఖ ఏజెన్సీ నుండి తీసుకెళుతున్నామని సమాధానం ఎదురయ్యేది. ఇప్పుడు కిర్లంపూడి మండలం కృష్ణవరం టోల్గేట్ వద్ద పట్టుబడ్డ గంజాయి స్మగ్లర్లు అయినా ఆయుబ్ ఖాన్, ఇజాజ్ ఖాన్ లు మాత్రం రాజమండ్రి నుండి విశాఖ మీదగా జంషెడ్పూర్ చేర వేస్తున్నామని పోలీసులకు తెలపడంతో తామంతా ఆశ్చర్యానికి గురయ్యామని జగ్గంపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ బి. సూర్య అప్పారావు మీడియా ద్వారా వివరించారు. అందులో భాగంగా మండల కేంద్రం కిర్లంపూడి లో ఉన్న పోలీస్ స్టేషన్లో సబ్ ఇన్స్పెక్టర్ B.తిరుపతిరావు ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో సీ.ఐ పాల్గొని గంజాయ్ పట్టుబడ్డ తీరును పాత్రికేయులకు వివరించారు. ఈ సందర్భంగా జగ్గంపేట సి.ఐ మాట్లాడుతూ కాకినాడ జిల్లా ఎస్పీగా ఎం. రవీంద్రనాథ్ బాబు బాధ్యతలు తీసుకున్న తర్వాత జాతీయ రహదారిపై గంజాయి నియంత్రించడంలో మంచి ఫలితాలను సాధించామని తెలిపారు. ప్రస్తుతం తమకు పట్టుబడ్డ గంజాయి 300 కేజీలు సామర్థ్యం కలిగి ఉందని అన్నారు. అదేవిధంగా ఐషర్ వ్యాన్ లో బియ్యం బస్తాలు మాటున ఒక ప్రత్యేకమైన అరను ఏర్పాటు చేసి తద్వారా ఈ అక్రమ రవాణాకు సన్నాహాలు చేసుకున్నారని తెలిపారు. తాము స్వాధీనం చేసుకున్న సొత్తు వాహనం తో కలిపి 18 లక్షల పైబడి విలువ చేస్తుందని అన్నారు. అందుచేత స్మగ్లర్లు ఈ విధమైన అక్రమ రవాణా కు ఎన్ని పన్నాగాలు పన్నినా పోలీసులను తప్పించుపోలేరన్నా సంగతి గుర్తుంచుకోవాలని సీఐ స్మగ్లర్లను హెచ్చరించారు. తమ సర్కిల్ పరిధిలో స్వాధీనం చేసుకున్న గంజాయినంతా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు త్వరలోనే దగ్ధం చేయడం జరుగుతుందని ఆయన మీడియా ద్వారా వివరించారు. ఈ కార్యక్రమంలో ఎస్.ఐ తిరుపతిరావు, ఏ.ఎస్.ఐ లు రామకృష్ణ, కుమార్, రైటర్ నాగళ్ళ వెంకటరమణ, H.C లు అప్పారావు, ప్రసాద్, అదేవిధంగా కానిస్టేబుల్స్ శ్రీనివాస్, గణేష్, శివ, సత్యనారాయణ, సుబ్బిరామిరెడ్డి తదితర సిబ్బంది పాల్గొన్నారు.

ADD

spot_imgspot_imgspot_imgspot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_imgspot_imgspot_imgspot_img

Most Popular

spot_imgspot_imgspot_imgspot_img

Recent Comments