MCN NEWS భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా….
అశ్వాపురం మండల పరిధిలోని మొండికుంట పంచాయతీ మల్లెల మడుగు గ్రామానికి చెందిన గుంజల కృష్ణయ్య ఇల్లు ప్రమాదవశాస్తూ దగ్ధం అయి కట్టుబట్టలతో మిగిలారు.. ఇంటి లోని సామాగ్రి తో పాటు ఇల్లు బాగు చేయించుకోవడానికి ఇంట్లో దాచుకున్న రెండు లక్షల రూపాయలు నగదు కూడా మంటల్లో కాలిపోయయనీ తెలిసి స్పందించిన మణుగూరు పట్టణానికి చెందిన జనం కోసం మనం స్వచ్చంద సంస్థ 10వేల రూపాయలు నగదు.. వంట పాత్రలు, బట్టలు అందించారు. అలాగే భద్రాచలం పట్టణానికి చెందిన దుర్గా స్వీట్స్ అధినేత బిర్రు సుధాకర్ దంపతులు 50కేజీల బియ్యం. అశ్వాపురం మండలం మొండికుంటకు చెందిన గ్రామీణ వైద్యులు సుభాని 1000 రూపాయలను.. గ్రామ సర్పంచ్ కోడి కృష్ణవేణి చేతులమీదుగా అందించారు… ఈ కార్యక్రమంలో సంస్థ ఫౌండర్ గూడూరు కృష్ణారెడ్డి సభ్యులు పునాటి పాపయ్య, సుభాని, గ్రామస్తులు ఐలయ్య, మురళి పాల్గున్నారు