MCN NEWS : కిర్లంపూడి కాకినాడ జిల్లా : ప్రత్తిపాడు జగపతినగరం గ్రామాల్లో ఉన్న అఖిల్ ఐఐటి టాలెంటెడ్ స్కూల్ మరియు జూనియర్ కళాశాల క్యాంపస్ లో మూడు రోజులపాటు తమ స్కూలు పిల్లలచే సంక్రాంతి పండగ వారోత్సవాలను దిగ్విజయంగా చేపట్టినందుకు అధ్యాపక సిబ్బంది ప్రతి ఒక్కరికి తమ స్కూలు కళాశాల తరఫున కృతజ్ఞతలను తెలియజేసుకుంటున్నానని స్కూల్ కరస్పాండెంట్ ఇనకోటి గంగాధర్ వివరించారు. నూతన సంక్రాంతి పండుగను పురస్కరించుకొని ప్రతిపాడు తమ కళాశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఫెస్టివల్ ఈవెంట్స్ లో ఆయన ముఖ్య అతిథిగా విచ్చేసి అధ్యాపక సిబ్బందితోపాటు పిల్లలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ముందుగా స్కూల్ ప్రాంగణంలో కళాశాల విద్యార్థినిలు చిన్నారులు ప్రదర్శించిన భోగిమంట ముత్యాలు ఆహుతులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. అనంతరం చిన్నారులు ప్రదర్శించిన వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు పలువురిని అలరించాయి. ఈ సందర్భంగా కరస్పాండెంట్ గంగాధర్ పిల్లలను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ కళాశాల మరియు పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు అందరూ చక్కగా చదువుకొని మంచి క్రీడా స్ఫూర్తిని చాటాలని కోరారు. ఈ కార్యక్రమంలో కళాశాల డైరెక్టర్ ఈయన ఇనకోటి సునీత గంగాధర్, ప్రిన్సిపల్ సొరపునీడి బుజ్జి, ఏవో కొప్పుల సత్యనారాయణ, వైస్ ప్రిన్సిపల్ కాశి, స్టాప్ లతా, రాణి, హరికృష్ణ, నాగేశ్వరరావు, రవి, శ్రీనివాస్ తోపాటు విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.
అఖిల్ జూనియర్ కళాశాలలో సంక్రాంతి సంబరాలు.
ADD
RELATED ARTICLES