MCN NEWS :ఏలేశ్వరం. ఎర్రవరం గ్రామంలో విజ్ఞాన జ్యోతి జూనియర్ కాలేజ్ ఆవరణలో నేషనల్ బ్యాంక్ ఫర్ రూరల్ డెవలప్మెంట్ (నాబార్డ్) సౌజన్యంతో కాకినాడ జిల్లా కేంద్ర సహకార బ్యాంకు వారి పర్యవేక్షణలో విద్యార్థులకు ఆర్థిక అక్షరాస్యత పై అవగాహన సదస్సు ఏలేశ్వరం కో ఆపరేటివ్ బ్యాంక్ వారి ఆద్వర్యం లో నిర్వహించడం జరిగింది. కళా జాతర బృందం ద్వారా అవగాహన కల్పించడం జరిగింది.ఈ సదస్సు లో విద్యార్థులకు ఉన్నత విద్య కోసం బ్యాంక్ వారు ఇచ్చే ఋణాలు గురించి,మహిళలు పొదుపు, వివిధ రకాల డిపాజిట్లు,ప్రతి ఒక్కరూ బ్యాంక్ ఖాతాలను గలిగి వుండాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బ్యాంక్ మేనేజర్ సి హెచ్ సూర్యప్రకాష్ గారు,బ్యాంక్ సూపర్వైజర్,విద్యార్దులు, అధ్యాపకులు పాల్గొన్నారు.
అక్షరాస్యతపై అవగాహన సదస్సు
ADD
RELATED ARTICLES