రాయవరం : అంబేద్కర్ కోనసీమ జిల్లా రాయవరం మండలం ఆల్ ఇండియా డిమాండ్స్ డే పురస్కరించుకొని రాయవరం ఐసిడిఎస్ ప్రాజెక్ట్ కార్యాలయం వద్ద అంగన్వాడి వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్, సిఐటియు ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. యూనియన్ జిల్లా అధ్యక్షురాలు సిహెచ్. కృష్ణవేణి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం 60 సంవత్సరాలు నిండిన వారిని ఇంటికి పంపించాలని చూస్తుంది వారికి pf గాని గ్రాడ్యూట్ కానీ ఏమీలేదు 2011 వేతనాలు పెంచలేదు 2011 తర్వాత నిత్యవసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగాయని గ్యాసు పెట్రోలు డీజిలు ధరలు విపరీతంగా పెరిగాయని మరి ఈ రకంగా పెంచకపోతే వీరు ఎలా బ్రతుకుతారని ప్రభుత్వాన్ని అడుగుతున్నామని అంతేకాకుండా సుప్రీంకోర్టు ప్రతి 1000 జనాభాకు అంగన్వాడి సెంటర్ పెట్టి అంగన్వాడి సేవలు విస్తృత పరచాలని తీర్పిస్తే ఇవాళ కేంద్ర ప్రభుత్వం నూతన విద్యా విధానాన్ని పేరుతో అంగనవాడి సేవలను ప్రజలకు అందకుండా సెంటర్లను కలుపుతున్నారని ఐసీడీఎస్ లక్ష్యానికి విరుద్ధంగా పి పి వన్ పి పి టు అనేది మన రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్నారని దీనిని మేము వ్యతిరేకిస్తున్నామని సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం అంగనవాడి సెంటర్లు 1000 లోపు మధ్యలోనే ఉండాలని వారు డిమాండ్ చేశారు అంతేకాకుండా రాయవరం ప్రాజెక్టు పరిధిలో రాజకీయ వేధింపులు చాలా తీవ్రంగా ఉన్నాయని చాలా దారుణమైన పరిస్థితి కనిపిస్తుందని ముఖ్యంగా బిక్కవోలు కొమరపాలెం గ్రామంలో అంగనవాడి వర్కర్ పై రాజకీయ నాయకులు భౌతికంగా దాడి చేశారని ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని ఎవరైతే అంగనవాడి కార్యకర్తపై దాడి చేశారో వారిపై థిస్ యాక్ట్ ప్రకారం కేసు నమోదు చేయాలన్నారు దాడికి గురైన అంగన్వాడి వర్కర్ కు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు అనంతరం ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డివిజన్ ప్రధాన కార్యదర్శి డి .ఆదిలక్ష్మి మండల అధ్యక్షురాలు ఎస్. కృష్ణకుమారి, ప్రాజెక్టు పరిధిలో రామచంద్రపురం, రాయవరం, బిక్కవోలు, అనపర్తి మండలాలకు చెందిన అంగన్వాడీ కార్యకర్తలు, హెల్పర్స్ పాల్గొన్నారు. ( కోనసీమ స్టాఫ్ రిపోర్టర్ ప్రసాద్ పలివెల )
అంగన్వాడి వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్, సిఐటియు ఆధ్వర్యంలో నిరసన
ADD
RELATED ARTICLES